27.1 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భారీగా నగదు స్వాధీనం

 

. . . 10 మంది అరెస్ట్, ఇద్దరు పరారీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ – 2 కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో భారీగా నగదుతో పాటు పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, పేకాట స్థావరంపై దాడి చేసి మొత్తం 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అరెస్టైన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పలు కార్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ పేకాట రాయుళ్లను తదుపరి విచారణ నిమిత్తం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More articles

Latest article