- ఇద్దరు ఆర్గనైజర్ల అరెస్టు
- ఇద్దరు విటులు, ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిజాంబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని నాగారం 50 క్వార్టర్స్ రాజీవ్ గృహకల్పలో జరుగుతున్న వ్యభిచారం గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేసారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్గనైజర్లు అరెస్టు చేశారు. ఇద్దరు విటులను, ఐదుగురు మహిళలను అదుపులో కీ తీసుకున్నారు. నిర్వాహకులు వద్ద 93250 నగదు తో పాటు 9 సెల్ ఫోన్ స్, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
- ఐదు సంవత్సరాలుగా జలీల్ గలీజ్ పనులు..
నాగారం 50 క్వార్టర్స్ కు చెందిన జలీల్ ఖాన్ అనే వ్యక్తి వ్యభిచార కేంద్రం ను నిర్వహిస్తున్నాడు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఒకసారి పోలీసులు రైడ్ చేయగా మూతపడ్డ కేంద్రాన్ని ఐదు సంవత్సరాల క్రితం తిరిగి తెరిచి యధావిధిగా కొనసాగిస్తున్నాడు. అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై గతంలో ఐద్వా స్థానిక ప్రజాసంఘాల నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా కలెక్టర్కు లిఖితకు పూర్వకంగా ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా అధికార పార్టీలో నాయకుడిగా చలామణి అవుతున్న సదరు వ్యక్తి నెట్వర్క్ ను పెంచి పోషిస్తున్నట్టు తెలిసింది… స్థానిక పోలీసులు వారితో మీలాగా అయ్యారని కొందరు ఏకంగా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో ఈ దాడి జరిగినట్టు సమాచారం. నగర్ శివారులోని నాగారం రాజీవ్ గృహ కల్ప కేంద్రంగా జరుగుతున్న వ్యభిచారం కు ఆర్గనైజర్లు పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను, యూవతులను రప్పించి దందా చేస్తున్నట్టు సమాచారం. మైనర్లను కూడా ఈ రూమ్ లో దింపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గలీజ్ పనుల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేస్తే గంజాయి బ్యాచ్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. చక్రధర్ నగర్ తాండ మీదుగా రాకపోకలు నిర్వహిస్తూ వచ్చి పోయే వారిపై నిఘా కోసం నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని దందా నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది.
