నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ఉత్తమప్రతిభ కనబర్చారు.
వ్యాసరచన పోటీల్లో లక్ష్మీమేఘన(9వ తరగతి), డ్రాయింగ్ పోటీల్లో వైభవి(7వ తరగతి) విజేతలుగా నిలువగా, సీపీ సాయి చైతన్య మెమెంటోలు అందజేశారు. విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ రామోజీరావు అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు కో కరికులర్ ఆక్టివిటీస్ పై శ్రద్ధ పెంచుకొని ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ దిగంబర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
