నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో గురువారం నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాలెంట్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన,పాటలు,అథ్లెటిక్స్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లయన్స్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావ్, లయన్స్ క్లబ్ అద్యక్ష కార్యదర్శులు ఎ.లింబాద్రి, సీహెచ్,రవీంద్రనాథ్, కోశాధికారి పి.రాఘవేందర్, పూర్వాద్యక్షులు సి.గంగాదాస్, పాఠశాల ఉపాద్యాయులు మల్లేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.