25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా 49 ఆవులు, గేదెలకు టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యుడు గౌస్, పశువైద్య సిబ్బంది, పశువుల పెంపకం దారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article