చెల్లింపులపై రాయితీల ప్రకటన
వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన క్విక్ కామర్స్ విభాగమైన ఇన్ స్టామార్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు నిత్యావసర సరుకులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్టేషనరీ ఇలా పలు రకాల వస్తువులు డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈజాబితాలోకి తాజాగా స్మార్ట్ ఫోన్లను కూడా 10 నిమిషాల్లోనే డెలివరీ అందించనున్నారు.ఈవిషయాన్ని కంపెనీ ఓప్రకటనలో తెలిపింది. యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్, రెడ్ మీ, ఒప్పో, వివో, రియల్ మీ, మోటొరోలా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను నిముషాల్లో డెలివరీ అందించనున్నట్లు ఇన్ స్టామార్ట్ పేర్కొంది. చెల్లింపులపై ఆఫర్లును కూడా ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.11,499 చేసే కొనుగోళ్లపై 5 శాతం లేదా రూ. 4వేల వరకు రాయితీ పొందొచ్చని తెలిపింది. హైదరాబాద్ పాటు బెంగళూరు, డిల్లీ, ముంబాయి, చెన్నై, కలకత్తా, పూణ నగరాల్లో ఎంపిక చేసిన10 ప్రాంతాల్లో తొలుత ఈసేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలో మరిన్ని నగరాలకు ఈసేవలను విస్తరించనున్నారు.
