రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ అయోషాసిద్దిఖా ఆధ్వర్యంలో స్వస్త్ నారీ సశక్స్ పరివార్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక వైద్య నిపుణురాలైన దంత వెద్యురాలు డా.నీలిమ, పిల్లల వైద్య నిపుణులు డా. ప్రవీణ్, కంటి ఆఫ్గాల్మిక్ ఆఫీసర్ డా. మల్లయ్యచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిభిరంలో మొత్తం 116 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా (పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారి శ్రీనివాస్, ఆరోగ్య పర్యావేక్షకులు రవి, సుమతి, ఆరోగ్య కార్యకర్తలు అనిత, గౌరి, శిరీష, రమాదేవి, నర్సింగ్ ఆఫీసర్ వరలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ తరుణ్, ఆశాకార్యకర్తలు లత, నిర్మల, భూలక్ష్మి, ప్రేమల, ఇందిర, రంజన, లక్ష్మీలు పాల్గొన్నారు.
