25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అమెరికాలోని డెన్వర్ ఉత్సవ్ ఈవెంట్ లో సుమ కనకాల

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలుగు కుటుంబాలతో ఫ్యామిలీ నైట్ కార్యక్రమం

 

. . . నిజామాబాద్‌కు చెందిన జాన్ లిబ్ని బాతుక సుమకనకాలకు ప్రత్యేక ఫోటోషూట్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ

 

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరంలో ఉత్సవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెన్వర్ ఫ్యామిలీ నైట్ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల పాల్గొన్నారు. డెన్వర్ ఫ్యామిలీ నైట్ కార్యక్రమంలో సుమ కనకాల ప్రేక్షకులతో కలిసిపోయి నిర్వహించిన సరదా ఆటలు, వినోద కార్యక్రమాలు, ఆత్మీయ సంభాషణలు తెలుగు కుటుంబాలకు స్వదేశంలో ఉన్న అనుభూతిని కలిగించాయి. అమెరికాలో వేల మైళ్ల దూరంలో ఉన్నా, ఆ సాయంత్రం ప్రతి ఒక్కరికీ తమ సొంత ఊరిలో ఉన్నట్టే అనిపించిందని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన జాన్ లిబ్ని బాతుకకు ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమ కనకాలతో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించే అరుదైన అవకాశం లభించింది. ఆ రెండు రోజుల పర్యటనలో ఆమెతో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించే అవకాశం జాన్ లిబ్ని బాతుకకు దక్కింది. ఆ రెండు రోజులలో ఆమెతో కలిసి ఫోటోషూట్ నిర్వహించడం తన జీవితంలో మరచిపోలేని అనుభవమని జాన్ లిబ్ని బాతుక తెలిపారు. సెలబ్రిటీతో కలిసి పనిచేస్తున్నామనే భావన కంటే,ఒక కుటుంబ సభ్యురాలితో గడిపిన ఆప్యాయ సమయం అనే అనుభూతే ఎక్కువగా కలిగిందని ఆయన చెప్పారు. సుమలో ఎక్కడా సెలబ్రిటీ అనే గర్వం కనిపించలేదని, చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరితో ఒకే విధమైన ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో మెలిగారన్నారు. ఆమె సరళత, వినయం, హాస్యచతురత, మనుషులను గౌరవించే తీరు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆమె వ్యక్తిత్వం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని జాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాన్ లిబ్ని బాతుకనేటి సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం గురించి సుమ కనకాలని ప్రశ్నించారు. ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే చాలామంది తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొందరు జీవితంపై ఆశనే కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలిఅని అడగగా, సుమ కనకాల ఎంతో సరళంగా కానీ హృదయాన్ని తాకే సమాధానం ఇచ్చారు. జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడకండి. వీలైనంత వరకు మర్చిపోయి ముందుకు సాగండి జీవితం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుందన్నారు. ఈ ఒక్క వాక్యం తన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిందని జాన్ తెలిపారు.జీవితంలో కష్టాలు, అపజయాలు, బాధలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. కానీ అవి శాశ్వతం కావు. ఒక సమస్య కోసం మన అమూల్యమైన జీవితాన్ని కోల్పోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ప్రతి ఉదయం కొత్త ఆశను, కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది. మనల్ని ప్రేమించే కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు, మన కోసం ఎదురు చూస్తున్న మంచి రోజులు ఉన్నాయి. అందుకే జీవితాన్ని ప్రేమిద్దాం, నవ్వుతూ ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. మానసికంగా కుంగిపోయిన వారు తమ బాధను మనసులో దాచుకోకుండా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడాలని ఆయన సూచించారు. సహాయం కోరడం బలహీనత కాదు, అది ధైర్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. జాన్ లిబ్ని బాతుక మాట్లాడుతూ సుమ కనకాలతో గడిపిన ఆ రెండు రోజులు నాకు కేవలం అందమైన ఫోటోలు మాత్రమే ఇవ్వలేదు. జీవితాన్ని సానుకూలం గా చూడడం, వినయంగా ఉండడం, ప్రతి మనిషిని గౌరవించడం, చిరునవ్వుతో జీవించడం వంటి ఎన్నో విలువైన పాఠాలను నేర్పాయన్నారు. ఆ రెండు రోజుల అనుభవం నా జీవితాంతం స్ఫూర్తిగా నిలిచిపోతుందని అన్నారు.

More articles

Latest article