కామారెడ్డి, బతుకమ్మ:
నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ సభ్యులు కామారెడ్డి జిల్లా సింధూ శర్మ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం లొంగిపోయిన మావోయిస్టు ల వివరాలను ఎస్పీ సింధూ శర్మ వివరాలను వెల్లడించారు.. ఎస్పీ సింధూశర్మ కథనం ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం చర్ల గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ , చత్తిస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఉట్ల పల్లి కి చెందిన సోడి బాలకృష్ణ లు లోంగిపోయిన వారిలో ఉన్నారు. గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ 2022 లో మావోయిస్టు హిడ్మా ఆధ్వర్యంలో నక్సల్స్ లో చేరి యూ జి క్యాడర్ లో టెక్నికల్ టిం సభ్యులు గా ఉన్నారు. 2024 పుసుగుప్ప సిఆర్పిఎఫ్ క్యాంపు పై దాడి ఆయుదాల అపహరణలో పాల్గొన్నాడు. గుమ్మిగూడ, గుండ్రాజ్ గుడేం, పాలగూడ, తంబేల్ బట్టి, తమరేల్, మల్లంపేట, పెద్ధ ఉట్ల పల్లి వద్ధ పోలిసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సురక్షితంగా తప్పించుకున్నాడు. సోడి బాలకృష్ణ 2018 సంవత్సరంలో చర్ల ఏరియా కమిటీ మిలిషియా మెంబర్ గా అరుణ్ డి వి సి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. 2019 సంవత్సరంలో చర్ల ఏరియా కమిటీ పార్టీ మెంబర్ గా శారదా ఏసీఎస్ ఆధ్వర్యంలో పని చేశారు. 2022-23 లో మణుగు ఏరియా కమిటీ ఏసీఎస్ మంగుతు గార్డుగా పని చేసి తర్వాత నుంచి లొంగి పోయేంతవరకు చర్ల కమిటీ ఏసీ మెంబర్ గా పని చేసినాడు. కోండపల్లి, రెంగావ్, కర్రిగుట్ట, కోండపల్లి, పూజారి కాంకేర్, పాలగుడ ఎదురు కాల్పుల్లో తప్పించుకున్నాడు. 2024 లో ధర్మారం సిఆర్ పిఎప్ క్యాంపు పై దాడి చేసి ఆయుధాలు తీసుకెళ్లాలని ప్రయత్నించగా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
చత్తిస్ ఘడ్ మావోయిస్టులు కామారెడ్డిలో లోంగుబాటా ?
చత్తిస్ ఘడ్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన వారు కామారెడ్డి జిల్లాలో లొంగిపోవడం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం జిల్లా ఎస్పీ సింధూశర్మ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించకుండా విషయంను దాట వేశారు. చత్తిస్ ఘడ్ కు కామారెడ్డికి ఎ విధంగా సంబంధం లేదు. వారు లోంగిపోయారా లేక అరెస్ట్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేసి లొంగిపోయినట్లు ప్రకటించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యక్తం అవుతున్నాయి.
