సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,బతుకమ్మ : భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారులు మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ’లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ భద్రత‘ అంశంపై శనివారంహైదరాబాదులో నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని, ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ హైకోర్టు న్యాయమూర్తులు డీజీపీ జితేందర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
