బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : నగరంలోని లైన్ గల్లికి చెందిన షేక్ ఇమ్రాన్(30)అనే మెకానిక్ జీవితంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ చాలా రోజుల నుంచి మద్యం తాగుడుకి బానిసై ఏమి పని చేయక జులాయిగా తిరిగేవాడు. మద్యం తాగడానికి డబ్బులు సరిపోక ఇంట్లో గొడవ చేసేవాడు. గత రెండు రోజుల క్రితం భార్యను మాలపల్లి లోని పుట్టింటికి పంపించేసి తాగిన మత్తులో ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
