28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని

 

కామారెడ్డి, బతుకమ్మ: ప్రేమించిన అమ్మాయి నన్ను ఇన్ని రోజులు ప్రేమించి ఇప్పుడు నన్ను మోసం చేసిందని మంగళవారం ఉదయం 8:00 గంటలకు నిజామాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళుతున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి కామారెడ్డి పట్టణం డ్రైవర్స్ కాలనీకి చెందిన సచిన్ (26) అశోక్ నగర్ రైల్వే గేట్ పడడంతో రైలు వస్తుందని గమనించి రైల్వే గేట్ కు కామారెడ్డి రైల్వే స్టేషన్ కు మధ్యలో పట్టాలపై పడుకున్నాడు. స్థానికులు గమనించిన వెంటనే అప్రమత్తమై యువకున్ని పక్కకు లాక్కొని రావడంతో ప్రమాదం తప్పింది. యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ నెలకు 35 వేల వేతనం యువకునికి తండ్రి ప్రవీణ్ ఉన్నాడు. స్థానికులు తండ్రికి సమాచారం అందించి అప్పగించారు.

More articles

Latest article