27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విజయవంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

  • అభినందించిన జిల్లా కలెక్టర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ఇంటర్ విద్య అధికారితో పాటు పరీక్షల నిర్వహణ కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా పరీక్షల విభాగంకు విద్యుత్ శాఖ, ఆర్టీసీ, ఆరోగ్యశాఖ, పోస్టల్, శాఖ, మున్సిపల్, గ్రామ పంచాయతీ విభాగాలు సహకరించాయని తెలియజేశారు. అలాగే జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఎప్పటికప్పుడు తమకు సహకరిస్తూ అన్ని విభాగాలను సమన్వయం చేసి తమను ఇంటర్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు ముందుకు నడిపించాలని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియోదిన్, అస్లాం, హై పవర్ కమిటీ శ్రీనాథ్ పాల్గొన్నారు.

More articles

Latest article