25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

24 నుండి ఫిజిక్స్, ఎకనామిక్స్ మూల్యాంకనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 24వ తేదీ నుండి ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఫిజిక్స్, ఎకనామిక్స్ అధ్యాపకుల ఆర్డర్ కాపీలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాల లాగిన్లలో నిక్షిప్తం చేసినట్లు పేర్కొన్నారు వెంటనే తమ అపాయింట్మెంట్ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకొని 24వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు మూల్యాంకన కేంద్రంలో అధ్యాపకులు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఆయా గురుకుల కళాశాల ల ప్రిన్సిపాల్ లు వెంటనే ఫిజిక్స్, ఎకనామిక్స్ అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ప్రిన్సిపాల్ లు  వెంటనే మూల్యాంకనం ఆర్డర్ కాపీలు వచ్చిన అధ్యాపకులను విధుల నుండి రిలీవ్ చేయనట్లయితే ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్య అధికారి స్పష్టం చేశారు. నాట్ అప్పాయింట్డ్ లిస్టులో ఉన్న అధ్యాపకుల ను కూడా మూల్యాంకనం విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.

More articles

Latest article