26.6 C
Hyderabad
Monday, August 3, 2026

నాసిరకంగా రహదారి పనులు…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు తీవ్ర సమస్యగా మారుతున్నాయి. సరైన పర్యవేక్షణ కొరవడటం, తక్కువ నాణ్యత గల మెటీరియల్ వాడటం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ వద్ద నూతనంగా జాతీయ రహదారి పనులు చేపట్టారు. రహదారి పనులలో నాణ్యత లోపించడంతో రోడ్డుకు పగుళ్లతో ఒక్కసారిగా పెద్ద గుంతగా ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తుండడంతో రోడ్డు పనులు ముగియకముందే నిర్మాణాలు కూలిపోతున్నాయని మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article