బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణ మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కు బీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. వర్షాల కారణంగా 38వ వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు, శానిటేషన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ముఖ్యంగా 12వ, 35వ వార్డుల్లో రోడ్ల గుంతలు పూడ్చి, డ్రైనేజీలను శుభ్రపరచాలని కోరారు. ఇళ్ల మధ్య నిల్వ నీటిని తొలగించకపోతే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు ఇప్పటికే అనారోగ్యానికి గురవుతున్నారని వివరించారు. రాబోయే వినాయక చవితి, మిలాదున్ నబి పండుగల సందర్భంలో మండపాల వద్ద, ర్యాలీ మార్గాల్లో పరిసరాలను శుభ్రపరచడంతో పాటు అవసరమైనచోట కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మండపాల దగ్గర డస్ట్ మరియు మోరం వేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పెరక రామకృష్ణ, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు నాగుల రవిశంకర్ గౌడ్, శంకర్, అబ్దుల్ రహీం అత్తారి తదితరులు పాల్గొన్నారు.
