మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేత

 బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణ మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కు బీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. వర్షాల కారణంగా 38వ వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు, శానిటేషన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ముఖ్యంగా 12వ, 35వ వార్డుల్లో రోడ్ల గుంతలు పూడ్చి, డ్రైనేజీలను శుభ్రపరచాలని కోరారు. ఇళ్ల మధ్య నిల్వ నీటిని తొలగించకపోతే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు ఇప్పటికే అనారోగ్యానికి గురవుతున్నారని వివరించారు. రాబోయే వినాయక చవితి, మిలాదున్ నబి...