. . . లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత
వెబ్ డెస్క్, బతుకమ్మ :
2024లో నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షల లంచాన్ని డిమాండ్ చేసిన ఎస్సై లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. బుధవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పై హైదరాబాద్ సిటీ రేంజ్ -1 అధికారులు దాడులు నిర్వహించారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కొట్టూర్ విజయ్ లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
. . . లంచం తీసుకుంటూ దొరికిన తూనికల కొలతల అధికారి
పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్న నిర్వాహకుల నుంచి లంచం తీసుకుంటూ తూనికల కొలతల శాఖ ఇన్స్ పెక్టర్ ఏసీబీకి చిక్కారు. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తూనికల కొలతల శాఖలో వెంకటేశ్వర్లు ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ లో వెరిఫికేషన్ సర్టిఫికెట్ రోజువారి ఇంధనం అమ్మకాల రిజిష్టర్ ఇవ్వాలంటే రూ.20 వేల లంచాన్ని డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ప్రైవేట్ పెట్రోల్ బంక్ టెక్నిషియన్ రవీంధర్ ద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.

