బతుకమ్మ, బోధన్: బోధన్ సబ్ కలెక్టర్ మున్సిపాలిటీ సానిటరీ ఇన్స్పెక్టర్ తో కలిసి, మున్సిపాలిటీ పరిధిలోని పలు ముఖ్యమైన ప్రదేశాలలో జరుగుతున్న కాలువల మరమ్మతుల పనులను పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని, నివాస ప్రాంతాలలో నీటి నిల్వ, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా పనులను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం వార్డు నం.10 లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సందర్శించారు. లబ్ధిదారుతో మాట్లాడి, బేస్ మెట్ స్థాయి వరకు మంజూరైన నగదు విడుదల అయిన విషయాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనుల స్థితిని పరిశీలించి, మరింత వేగంగా పనులు పూర్తి చేయాలని, అధికారులను సూచించారు.

