27.6 C
Hyderabad

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మున్సిపాలిటీ చైర్మన్ రమేష్ షట్కర్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

చదువు లేనిదే జీవితంలో అభివృద్ధి సాధ్యం కాదని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని మున్సిపాలిటీ చైర్మన్ సీమా రమేష్ షట్కర్ సూచించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ చైర్మన్ సీమా రమేష్ షట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సేటు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కార్తీక్ ధర్పల్లి, నౌషా నాయక్, కుర్కటే శ్యామల, మహమ్మద్ ముజాహిద్, షేక్ గులాం, సైముద్దీన్‌తో పాటు కోఆప్షన్ సభ్యులు చింతల హనుమాన్లు, బొగడ మేతాన్ భాయ్, సాయిలు, షేక్ అసాద్ పాల్గొన్నారు.

 

Students should focus on their studies.

More articles

Latest article