25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీ.పెద్దన్న

బతుకమ్మ, మోర్తాడ్: మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీ.పెద్దన్న అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సేవించరాదని శారీరక మానసిక ఆరోగ్యాలతో అనుకున్న లక్ష్యాలను సాధించుటకు అలుపెరుగని కృషి చేయాలని పేర్కొన్నారు. శనివారం మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ పేస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి అధ్యాపకులు రవీందర్, పూర్వ విద్యార్థులు రంజిత్, ప్రశాంత్ నలినీకాంత్ ప్రసంగించారు. అనంతరం రాష్ట్రస్థాయి ప్రాజెక్టుకు ఎంపికైన విద్యార్థులకు, పీజీ ఎంట్రెన్స్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, క్రీడల్లో, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు మెమేం టోలు అందజేశారు. నూతనంగా కాలేజీలో చేరిన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన ఫైనల్ విద్యార్థులకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజయ్య, దశరథ్, పద్మా, స్రవంతి, బ్యులా, అర్చన, కళాశాల సిబ్బంది అశోక్, బాబన్న, గంగారం, సోనీ, రాణి, పుష్ప, గీత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Students should climb higher peaks

More articles

Latest article