విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

0 8,974

 

. . . జడ్పీ సీఈవో చంద్ర నాయక్

 

జుక్కల్, బతుకమ్మ :

 

అంగన్ వాడీ సెంటర్ లలో, ప్రైమరీ స్కూల్ లలో విద్యార్థులకు మెనూ ప్రకారం పక్కాగా భోజనం అందించాలని జడ్పీ సీఈవో చంద్ర నాయక్ అధికారులను ఆదేశించారు. జుక్కల్ మండలంలోని హంగార్గా, మాదాపూర్ గ్రామాల్లో శనివారం జడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంగన్ వాడీ సెంటర్లను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రైమరీ స్కూల్ ను తనిఖీ చేసి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను అందించాలని ఆయన ఆదేశించారు. అనంతరం వార్డు మెంబర్ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Students should be provided with meals according to the menu.

Leave A Reply

Your email address will not be published.