25.9 C
Hyderabad
Tuesday, August 4, 2026

విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్

 

బాల్కొండ, బతుకమ్మ :

 

విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాల్కొండ గ్రామ పంచాయితీ సర్పంచ్ గాండ్ల రాజేష్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత వేడుకలు నిర్వహించారు.

 

Students should be at the forefront of achieving their goals.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అదే విధంగా ఆదర్శ పాఠశాలలో జరిగిన ఎన్నికలలో ఎన్నికైన హెడ్ బాయ్, హెడ్ గర్ల్ లను ప్రశంసించి సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయ బృందం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం విద్యార్థులు పాటలు, డ్యాన్స్ లతో సందడి చేయడం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణేష్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

 

Students should be at the forefront of achieving their goals.

More articles

Latest article