26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కరాటేలో సత్తా చాటిన రాంపూర్(కలాన్) పాఠశాల విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : సంగారెడ్డిలో ఫిబ్రవరి 26న వారియర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ఓపెన్ నేషనల్ కుంగ్ఫు కరాటే పోటీలలో పిట్లం మండలం రాంపూర్(కలన్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు 3 గోల్డ్ మెడల్స్,3 సిల్వర్ మెడల్స్ సాధించారు. కుంగ్ఫు మాస్టర్ శివప్రసాద్ పాఠశాల విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు శ్రీలతతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విట్టల్, అధ్యాపక బృందం సాయిబాబు, సయ్యద్ నబీ, బుజ్జయ్య, స్వరూప, రాజు, శివనాగేశ్వరరావు, నీలిమ, పిటి మల్లేష్, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article