- రూద్రూర్ మోడల్ కళాశాల వసతి గృహంలో ఘటన
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలు
రూద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివారులో గల మోడల్ కళాశాల వసతి గృహంలో విద్యార్ధినీలకు శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అందులో ఎనిమిది మంది విద్యార్థినిలను వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోడల్ కళాశాల వసతి గృహంలో 120 మంది విద్యార్థినీలు ఉన్నారు. అందులో 97 మందికి తినకముందు (బ్రేక్ ఫాస్ట్) ఐరన్ మాత్రలు ఇచ్చారని తెలిసింది. ఆ తరువాత భోజనం చేయగా 8 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురి కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినీలు తినకుండా ఐరన్ ట్యాబ్లేట్ లు వేసుకోవడం వలననే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు నిర్ధారించారు. వసతి గృహంలో విద్యార్థినీలు బ్రేక్ ఫాస్ట్ చేయకున్న పట్టించుకునే నాథుడు లేడని స్పష్టం అవుతుంది. మోడల్ కళాశాల వసతి గృహం బాధ్యతలు కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్ లకు అప్పగించగా వారు అధిక పని భారం పేరిట పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. చదువు చెప్పడం వరకే మోడల్ కళాశాల బాధ్యత అని, హస్టల్ విషయం ఎస్ఓలకు తెలుసని ఒకరిపై ఒకరు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. హస్టల్ ఎస్ఓతో పాటు ఏఎన్ఎం నిర్లక్ష్యం మూలంగా విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రాథమికంగా తేలింది. డీఈఓ వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు భైరాపూర్ రవీందర్ గౌడ్, పుట్ట భాస్కర్ కోరారు.

