- పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా 210 కోట్లకు పైగా పేరుకుపోయిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం పెండింగ్ బకాయిలను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ లో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ఎస్సీ విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో స్కీమ్ లో గత మూడు సంవత్సరాలుగా నిధులను కేటాయించడం లేదని, దీనివలన ఈ విద్యా సంవత్సరం విద్యార్థులే పుస్తకాలు యూనిఫామ్ లు కొనుక్కుంటున్నారని , బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ పాఠశాలలు మేము నిర్వహించలేము అని చేతులెత్తేస్తున్నారని అన్నారు. పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విద్యార్థులు చదువుకునే స్కీమ్ కి నిధులు కేటాయించకపోవటం వారిపై ఆర్ధిక భారమేనని అన్నారు. పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నిజామాబాద్ నగర నాయకులు నిఖిల్, దేవిక, సాయికిరణ్, దుర్గాప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
