. . . బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి
బిచ్కుంద, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని నూతన న్యూ ఆర్కిడ్స్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందకుండా నిరభ్యంతరంగా తెలంగాణ ప్రభుత్వం చే గుర్తింపు పొందబడిన న్యూ ఆర్కిడ్స్ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించుకోవచ్చని అన్నారు. ఆ పాఠశాలపై ఎటువంటి ఆరోపణలు లేవని, చట్టబద్ధంగా అన్ని రకాలుగా అర్హతలు కలిగి ఉన్నదని, విద్యార్థులు తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
