విద్యార్థులు నిరభ్యంతరంగా న్యూ ఆర్కిడ్స్ పాఠశాలలో చేరవచ్చు
. . . బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని నూతన న్యూ ఆర్కిడ్స్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందకుండా నిరభ్యంతరంగా తెలంగాణ ప్రభుత్వం చే గుర్తింపు పొందబడిన న్యూ ఆర్కిడ్స్ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించుకోవచ్చని అన్నారు....