27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నారాయణ విద్యా వ్యాపారంపై విద్యార్థి సంఘాల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీజ్ చేసిన అధికారులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

డిచ్ పల్లి మండలంలోని కేశాపూర్ శివారులో ప్రభుత్వ అనుమతుతు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయించినట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం నారాయణ విద్యా సంస్థల ముందు ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి సీజ్ చేయించినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా టిజివిపి జిల్లా అధ్యక్షులు కళ్యాణ్, యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి, ఎఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి మెతరి రాజశేఖర్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండి డిచ్ పల్లి మండలం కేశపూర్ గ్రామ శివారులో అనుమతులు లేకుండా నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ఇంకా పూర్తికాని భవనాలలో సీబీఎస్సీ స్కూల్ పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అనేక సందర్భాల్లో సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.

 

Student unions protest against Narayana's education business.

 

అదే విధంగా సంబంధిత శాఖ అధికారులు ఈ నారాయణ విద్యా సంస్థలకు ప్రభుత్వ నుండి ఎలాంటి అనుమతులు లేవని పలుమార్లు నోటీసులు పంపించడం జరిగిందన్నారు. అయితే ఇక్కడున్నటువంటి నారాయణ విద్యాసంస్థల సిబ్బంది మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులను మోసపూరిత మాటలతో ఈ నారాయణ విద్యాసంస్థల బ్రాంచ్ కి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని టిజివిపి, యుఎస్ఎఫ్ఐ, ఎఐఎఫ్డిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించి స్థానిక ఎంఈఓ కి ఫిర్యాదు చేయగా ఎంఈఓ వచ్చి ఇక్కడున్నటువంటి నారాయణ విద్యాసంస్థల స్కూల్ సిబ్బందికి అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసి స్కూల్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ కూడా జూనియర్ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవని, తరగతులు గనుక నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసు అందించారన్నారు. అలాగే ఎంఈఓ, డిఐఈఓ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల స్కూల్ కు గాని, కళాశాల కు గాని పర్మిషన్ లేదని ఇట్టి విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు. మరల తరగతులు గనుక నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన నారాయణ విద్యాసంస్థల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని అలాగే కేశపూర్ గ్రామ శివారులో గల భవనాలలో నారాయణ విద్యా సంస్థతో ఎలాంటి తరగతులు నిర్వహించిన ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు మహేష్ , టిజివిపి జిల్లా నాయకులు కెవిన్, ఎఐఎఫ్డిఎస్ జిల్లా నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article