28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలో చేపట్టిన కళాశాల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.8 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను ఇప్పటికీ విడుదల చేయకపోవడం ఆందోళనకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి సరికాదని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకుండా ఫీజులు చెల్లించాలని కోరుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్, నరేష్, శ్రీను, నగర అధ్యక్షుడు జనార్ధన్, కార్యదర్శి శేఖర్ తో పాటు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Pending scholarships must be released.

More articles

Latest article