బతుకమ్మ మాచారెడ్డి: మాచారెడ్డి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల విచ్చలవిడితనాన్ని అరికట్టాలని మాచారెడ్డి మండల ఏబీవీపీ డిమాండ్ చేసింది. బయట ఇష్టం వచ్చినట్టు తిరిగినా ప్రిన్సిపాల్ పట్టించుకోపోవడం లేదని మండల కన్వీనర్ శశి ఆరోపించారు. వారికి నచ్చిన సమయంలో కళాశాలకు రావడం పోవడం ఏమిటని ప్రశ్నించిన విద్యార్థి నాయకులకు సంబంధిత విద్యార్థుల ముందే వివరణ ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఇష్టానుసారంగా వారికి నచ్చిన సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు తమ ఇష్టానుసారంగా బయటకు రావడం పోవడాన్ని కళాశాల యాజమాన్యం అరికట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు.