26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కల్తీకల్లు తయారీదారులపై కఠినచర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బతుకమ్మ బాన్సువాడ : కల్తీకల్లు తయారీదారుపై కఠినచర్యలు తీసకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులను ఆయన ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తో కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరాతీశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కల్తీకల్లు కూడా డ్రగ్స్ లో భాగమేనని, ప్రజలు ఇలాంటి కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి,ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవిన్యూ,పోలీస్ సిబ్బంది,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Strict action should be taken against the manufacturers of adulterated toffee

More articles

Latest article