29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా  మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని పండరి పూర్ చాయ్ హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటల్ లో ఓ బాల కార్మికుడు పనిచేస్తుండగా ఆ బాల కార్మికుడికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. అదేవిధంగా హోటల్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అన్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్న బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ ముస్కాన్ ఎస్సై పీటర్, కానిస్టేబుల్ లు సతీష్ కుమార్, గంగాధర్, సాయికుమార్, కృష్ణకుమారి, కృష్ణకుమారి తదితరులు ఉన్నారు.

More articles

Latest article