బాన్సువాడలో ఘటన
బాన్సువాడ, బతుకమ్మ : భారీ ఈదురుగాలులకు మేడపై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. తాడ్కోల్ శివారులోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూంలలో ప్రభు అనే వ్యక్తి సోమవారం రాత్రి డాబాపై పడుకున్నాడు. ఈదురుగాలులు వీయడంతో ఆయన లేచి నిలబడ్డాడు. ఈ క్రమంలో గాలిధాటికి దాబా పైనుంచి ఎగిరి కిందపడ్డాడు. భవనంపై నుంచి భారీ శబ్దం రావడంతో కాలనీ వాసులు వచ్చి చూసేసరికి ప్రభు మృతి చెందాడు. దీంతో తాడ్కోల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
