30.9 C
Hyderabad
Monday, August 3, 2026

రేషన్ బియ్యంలో రాళ్లు, నూకలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారుల పర్యవేక్షణా లోపం

 

. . . రేషన్ డీలర్లకు తప్పని తిప్పలు

 

రుద్రూర్, బతుకమ్మ  :

 

ప్రభుత్వం రేషన్ దుకాణాలకు పంపిణీ చేసిన రేషన్‌ బియ్యంలో రాళ్లు, నూకలు, పురుగులు కనిపించడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టు ప్రక్క గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంలో రాళ్లు, నూకలు, పురుగులు కనిపించడంతో ఈ బియ్యం ఎలా తినాలని లబ్ధిదారులు రేషన్ డీలర్ల పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సరఫరా చేసిన రేషన్ బియ్యంలో నూకలు, రాళ్లు, పురుగులతో నాసిరకంగా ఉంటున్నాయని,  అధికారుల పర్యవేక్షణ లోపం వలన రేషన్ డీలర్లకు తిప్పలు తప్పడం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.

 

Stones and grains in ration rice

 

More articles

Latest article