27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కంపు కొడుతున్న కాలనీ

Must read

📰 Generate e-Paper Clip

  • గ్రామపంచాయతీ నిర్లక్ష్యం

 

పిట్లం, బతుకమ్మ: పిట్లం మండల కేంద్రంలోని నిజాంసాగర్ పాత రోడ్ లో ఉన్న కాలనీవాసులకు చికెన్ వ్యర్ధాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్న చెత్తాచెదారాలు రోడ్డుపై పారేయడంతో కాలనీలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిట్లం మండల కేంద్రంలో ఉన్న చికెన్ సెంటర్లు పాస్పోర్ట్ సెంటర్ల బిడ్డలను కాలనీ పక్క గల రోడ్డుపై వేయడంతో కంపు వాసనతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అదే తంతుగా చికెన్ సెంటర్ ల యజమానులు రోడ్డుపై వేయడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ బలరాం కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంతో దుర్వాసన తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వ్యాధులతో ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డులు ఉన్న వాటిని వాడకంలోకి తీసుకోవడం లేదని ఎక్కడపడితే అక్కడ విడుదలను వేయడంతో రోగ్గల ఫాలో అవుతున్నామని అంటున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది కార్యదర్శి నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతుందని కాలనీవాసులు మొరపెట్టుకున్నారు. ఇట్టకేలకు ఎవరు చేసేది ఏమీ లేదని పత్రిక మిత్రులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి పగలు కాపు కాసి చికెన్ సెంటర్ ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చేస్తున్న నిర్వాకాన్ని చిత్రీకరించి పత్రిక సోదరులకు మొరపెట్టుకున్నారు. ఇకనైనా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో కమలాకర్ ప్రత్యేక శ్రద్ధ  చూపించి ఇలాంటి కార్యాచరణ చర్యలకు పాల్పడకుండా మండల కేంద్రంలో పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Stinking colony

More articles

Latest article