. . . జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావ్
హైదరాబాద్, బతుకమ్మ :
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, పోడు భూముల క్రమబద్ధీకరణ, ఎల్లారం తండా కు సంబంధించిన రెవెన్యూ రికార్డుల సమస్య ను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిని కోరారు. హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసారు.

అనంతరం నియోజకవర్గo లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని, నియోజకవర్గానికి కావాల్సిన అవసరాల గురించి వివరించారు. మంత్రి స్పందిస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారును ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగులో ఉన్న అన్ని దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలకు స్వంత ఇంటి కల సాకారం చేయటం లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్నారు.
