29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డీసీఎం వ్యాన్ లో గోవుల దొంగ రవాణా

Must read

📰 Generate e-Paper Clip

*  భిక్కనూరు టోల్గేట్ వద్ద పోలీసుల నుండి తప్పించుకుని పరారీ…

* మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద పట్టుకున్న పోలీసులు

.. భిక్కనూరు, బతుకమ్మ :

గోవులను ఆక్రమంగా తరలిస్తున్న వాహనం అదివారం రాత్రి వేళ కామారెడ్డి సరిహద్ధులను దాటింది.  విశ్వసనీయ సమాచారంతో భిక్కనూర్ పొలిసులు  స్థానిక గా టోల్ ప్లాజా వద్ధ బారీకేడ్లను పెట్టి అడ్డుకునే యత్నం చేయగా డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాటిని డికోట్టి డిసియంను చెక్ పోస్టులను దాటించాడు. బస్వాపూర్ వద్ధ పెద్ధ ఎత్తున యువత రోడ్డుపై ఆక్రమంగా తరలుతున్న గోవులతో వెలుతున్న డిసీయంను అడ్డుకునే ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు.. చివరకు పొలిసులు అప్రమత్తం చేయడంతొ మెదక్ జిల్లా నార్సింగిలో వద్ధ వాహనం వదిలి పరారీ అయ్యారు. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గోవులను డీసీఎం వ్యాను(ఎంహెచ్ 40 సిటి 4407)లో దొంగ రవాణా  చేస్తుండగా  భిక్కనూరు పోలీసులు  టోల్ ప్లాజా వద్ద అదే సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి ఆ డీసీఎం వ్యానును  పోలీసుల ఆపే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి వాహనాన్ని డ్రైవర్ ఆపకుండా టోల్గేట్ భారీ కేడ్ల ను ఢీకొని  పరారయ్యారు. ఈ సందర్బంగా అప్రమత్తమైన భిక్కనూరు పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలించలేదు. బస్వాపూర్ యువకులు భారీ సంఖ్యలో రోడ్డుపై చేరుకొని ఆ వాహనాన్ని ఆపడానికి విఫల యత్నం చేశారు. చివరకు మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద వాహనాన్ని పక్కన నిలిపివేసి అందులోని డ్రైవరు, క్లీనరు  పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట, భిక్కనూరు మండలాల విశ్వహిందూ బజరంగ్దళ్ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని  గోవులను అక్రమ రవాణా చేస్తున్న వారిని బహిరంగంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు.

 

Stealing of cows in DCM van

More articles

Latest article