24 C
Hyderabad
Sunday, August 2, 2026

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. మత్తు పదార్థాల నిర్మూలన లో భాగంగా పోలీస్ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మోర్తాడ్‌ మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ, 2K రన్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article