- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు)బిఎల్పి రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో నవంబర్ 10న జిల్లా కలెక్టర్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపాలని నిర్ణయించినట్లు బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 2025లో బిసి కులాల ప్రజలకు విద్య,ఉద్యోగ, స్థానిక సంస్థల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులను ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ లకు పంపి7 నెలల అవుతున్న కేంద్ర ప్రభుత్వం వద్ద గత 7 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిసి బిల్లులను 9వ షెడ్యూల్ లో చేర్చందకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, జిల్లా కమిటి సభ్యురాలు రాధా పాల్గొన్నారు.
