25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ మున్సిపల్ కు రాష్ట్ర స్థాయి ప్రశంస

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి పన్నుల వసూల్ టార్గెట్ ను నిర్ణత సమయంలో పూర్తి చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన భీమ్ గల్ మున్సిపాలిటీకి రాష్ట్ర పురపాలక, పట్టణభివృద్ధి శాఖ ప్రశంను అందించింది. ఇందులో భాగంగా గురువారం రాజధానిలోని డాక్టర్. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు శ్రీదేవి ప్రశంస పత్రాన్ని భీమ్ గల్ కమిషనర్ గంగాధర్ కు అందజేశారు.ఈ సందర్బంగా కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ 77.63 శాతం ఆస్తి పన్ను వసూలుకు సహకరించిన మేనేజర్ నరేందర్, ఆర్. ఐ రాజేశ్వర్, వార్డు ఆఫీసర్లు, ఇంచార్జ్ సానిటషన్ ఇన్స్పెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు, పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article