27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్రస్థాయి అబాకస్ విజేతకు ఘన సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని వాణి సాహితీ విద్యానికేతన్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని సాక్షర రాష్ట్రస్థాయి అబాకస్ లో ప్రథమ స్థానంలో నిలిచి, రైజింగ్ స్టార్ ప్రశంసా పత్రం అందుకుంది. శనివారం రైడ్స్ (రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ) ఆధ్వర్యంలో సాక్షర డా/ఆ ఉప్పు సాయిలు ను ఘనంగా సన్మానించారు. విశ్వ ఎడిటిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థిని సాక్షర గతంలో జోనల్ టాపర్ గా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి రైజింగ్ స్టార్ గా బహుమతి పొందింది. ఈ కార్యక్రమంలో రైడ్స్ అధ్యక్షులు కర్రోల కృష్ణ ప్రసాద్, సభ్యులు మోత్కూరి నారాయణ, నూతి పల్లి బాలరాజ్, వాణి సాహితి ప్రిన్సిపల్ లోగం నాగరాజు, ఉపాధ్యాయులు సమీర్, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.

More articles

Latest article