27.4 C
Hyderabad

ఎస్సారెస్పీ 16 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా రావడానికి శుక్రవారం ఉదయ కాలం 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. సాయంకాలం వరకు వరద క్రమంగా పెరగడంతో ఎస్సారెస్పీ మరో 8 గేట్లను ఎత్తినట్లు ప్రాజెక్ట్ ఏ ఈ ఈ రవి తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ 16 గేట్లని ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని  గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు  ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు ఉంది.

More articles

Latest article