ఎస్సారెస్పీ 16 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల
మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా రావడానికి శుక్రవారం ఉదయ కాలం 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. సాయంకాలం వరకు వరద క్రమంగా పెరగడంతో ఎస్సారెస్పీ మరో 8 గేట్లను ఎత్తినట్లు ప్రాజెక్ట్ ఏ ఈ ఈ రవి తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ 16 గేట్లని ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ...