26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రజక సంఘం మండల అధ్యక్షులుగా శ్రీపతి దత్తు

Must read

📰 Generate e-Paper Clip

  • రజకుల హక్కుల సాధనకై పోరాటం : అధ్యక్షులు దత్తు

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి రజక సంఘం మండల కమిటీని జిల్లా అధ్యక్షులు గూపన్ పల్లి శంకర్,13 గ్రామాల రజక సంఘం మండల నాయకుల ఆధ్వర్యంలో శనివారం సాయిబాబా ఆలయంలో నూతన అధ్యక్షునిగా చంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన శ్రీపతి దత్తును మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు గూపన్ పల్లి శంకర్ తెలిపారు. ఉపాధ్యక్షులుగా గంగాధరోల్ల బాబయ్య,(సిర్నాపల్లి) ప్రధాన కార్యదర్శిగా కలిగోట్ ప్రదీప్, కోశాధికారిగా దుబ్బాక గంగారం, సలహాదారులు బాబు శరత్, గంగాధర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, కొరట్పల్లి నరసయ్య,మోహన్, చాకలి కల్లు గంగారం, జిల్లా ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన రజక సంఘం మండల అధ్యక్షులు శ్రీపతి దత్తు మాట్లాడుతూ తన పైన ఉన్న నమ్మకంతో మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రజక సంఘ కుల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రజకుల హక్కుల సాధనకై పోరాడటానికి రజక కుల నాయకులందరూ సహకరించాలన్నారు.  రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చిన దానికనుగుణంగా జిల్లా కమిటీ నుండి మండల కమిటీ వరకు అన్ని కమిటీలతో  అందరు ఐక్యంగా ఉండాలన్నారు.రజకుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని రజక కులాస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article