భీమ్ గల్, బతుకమ్మ : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీరామ పీఠం, శ్రీరామ సేవా మండలి ఆధ్వర్యంలో శ్రీశ్రీనివాస కళ్యాణం, కోటిదీపోత్సవం కార్యక్రమంను నేడు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ ప్రముఖ్ నంబి వాసుదేవ చార్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఈ బృహత్తర కార్యక్రమంను సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొనే మహిళలకు దీపాలు, వత్తులు ఇక్కడే సమాకుర్చడం జరిగిందని, ఇట్టి దీపోత్సవంలో మహిళాలు అధిక సంఖ్యలో పాల్గొని, దీపాలను వెలిగించి జన్మ సార్థకత చేసుకోవాలని ఆయన సూచించారు.
