28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

శ్రీసాయి భక్తుల బిక్షాటన

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : మండల శివారులో వెలసిన గోవిందా సాయి దేవాలయం 33వ వార్షికోత్సవం సందర్బంగా మండలం కేంద్రంలో గోవిందగిరి స్వామి శిష్యులు,సాయి భక్త బృందం బిక్షాటన కార్యక్రమంను శుక్రవారం ప్రారంభించారు. ఉదయం సాయి భక్తుల ఇంట్లో అల్పాహారంను చేసి మండల కేంద్రంలోని దాత ఇంటికి వెళ్లి బిక్షాటన చేశారు. భక్తుల ఇచ్చానుసారం ఆలయ వార్షికోత్సవ కార్యక్రమ విజయవంతానికి ఇచ్చిన ధన, వస్తు రూపేణా ఇచ్చిన బిక్షాన్ని భక్తితో స్వీకరించి దాతలను ఆశీర్వదించారు. మధ్యాహ్నం భిక్షా చేసిన భక్తులు సాయంత్రం వరకు భిక్షాటనను కొనసాగించారు. శనివారం కూడా మండల కేంద్రంలోనే భిక్షాటన కొనసాగుతుందని ధర్మ ప్రచారకులు కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో బెంగళూరుకు చెందిన గోవిందగిరి స్వామి శిష్యుడు శ్రీ రాఘవేంద్ర స్వామి, ఆశ్రమ, ఆలయాభివృద్ధి కమిటీ క్రియాశీల కార్యవర్గ సభ్యులు, గోవిందగిరి స్వామి శిష్యులు, సాయి సేవాసమితి సేవకులు, సాయి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article