30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహుడు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్‌గల్, బతుకమ్మ : శ్రీ లింబాద్రి గుట్ట పై జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీలక్ష్మి నరసింహులను గరుడ వాహనాం పై ఉంచి గరుడ సేవను అర్చకులు నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రి కొండపై శ్రీ లక్మీ నరసింహుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో మంగళహారతులు, మేళా తాళాలు, భాజ భజంత్రీలు, భక్తుల గోవింద నామ స్మరణాల మధ్య గరుడ వాహనం పై ప్రతిష్టించారు. రంగు రంగుల పూలతో గరుడ వాహనాన్ని, స్వర్ణాభారణాలతో స్వామి వారిని అలంకరించారు. పల్లకిలో ఆశీనులైన శ్రీ లక్మీ నరసింహులను గరుడ వాహనం పై ఉంచి కొండ మాడ వీధులలో ఊరేగించారు. అర్చకులు శ్రీవారికి నిర్వహించిన ఈ గరుడసేవ కార్యక్రమం లో భక్త జనం పాల్గొన్నారు.

Sri Lakshmi Narasimha on the Garuda vehicle

More articles

Latest article