బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని గాజుల్ పెట్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారికి వేద పండితులు, దుర్గామాత మాలధారణ వేసిన స్వాములు భక్తిశ్రద్ధలతో అభిషేకం, యజ్ఞం,అలంకరణ, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో శివశంకర్ యూత్, దుర్గామాత మాలదారణ స్వాములు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.