శ్రీ చైతన్య సీబీఎస్సీ పాఠశాలను తక్షణమే నిలిపేయాలి : టీజివీపి

0 15,276

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికారిక గుర్తింపు లేకుండా విద్యా వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య సీబీఎస్సీ పాఠశాలను తక్షణమే నిలిపేయాలని టీజీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో అక్రమంగా అడ్మిషన్స్ చేస్తున నిజామాబాద్‌ శ్రీ చైతన్య సీబీఎస్సీ కరికులం పాఠశాల అడ్మిషన్ ఫార్మ్ ను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశారు. ఇప్పటివరకు జిల్లా విద్యాధికారి గాని, మండల విద్యాధికారి గాని ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారని తెలిపారు. అనుమతులు లేని స్థితిలో కూడా పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు దురుద్దేశ్యంతో అర్థంలేని హామీలతో అడ్మిషన్ ఫారాలు ఇచ్చి, ఇప్పటివరకు 400కు పైగా అడ్మిషన్లు చేపట్టారని తెలిపారు. ఇది పూర్తిగా విద్యా నియమావళికి విరుద్ధమని అన్నారు. ఈ అక్రమ అడ్మిషన్స్ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అడ్మిషన్ తీసుకున్న తల్లిదండ్రులకు వెంటనే వారి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి, అనుమతులు లేని పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు  లేని పక్షం లో పెద్ద సంఖ్యలో డీఈఓ కార్యాలయం ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ , జిల్లా కార్యకర్తలు మహేష్,యశ్వంత్, ధర్మేంద్ మహేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.